భారతదేశం, డిసెంబర్ 28 -- మెల్‌బోర్న్ (MCG) వేదికగా జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ఊహించని విధంగా కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. 6 సెషన్లలో ఏకంగా 36 వికెట్లు పడటంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ గెలిచినప్పటికీ.. మ్యాచ్ త్వరగా అయిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. పిచ్ తీరు చూసి క్యూరేటర్ కూడా షాక్ అయ్యాడు.

బాక్సింగ్ డే టెస్ట్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటిది. కానీ ఈసారి మెల్‌బోర్న్ పిచ్ దెబ్బకు ఆ పండగ రెండు రోజులకే ముగిసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇదొక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది.

మ్యాచ్ రెండో రోజు సాయంత్రం సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ గెలిచిన తొలి టెస్ట్ ఇదే. కేవలం 6 సెషన్ల ఆటలో 36 వికెట్లు పడ్డాయి. 1909 తర్వాత యాషెస్...