Hyderabd, ఏప్రిల్ 24 -- తల్లిదండ్రులు కావడం ఒక ప్రత్యేకమైన అనుభూతి మాత్రమే కాదు పెద్ద బాధ్యత కూడా. పిల్లలను సంతోషంగా ఉంచడానికే పేరెంట్స్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వారు చేసే కొన్ని పనులు పిల్లల్ని చెడగొట్టడం ప్రారంభిస్తాయి.

పిల్లలు అడిగే ప్రతిదీ అంగీకరించడం, వారు తప్పులను చూసి కూడా మౌనంగా ఉండటం లేదా వారికి అతిగా ప్రేమను అందించడం వంటివన్నీ కూడా పిల్లల అభివృద్ధిపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు పేరెంటింగ్ శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. మీ పిల్లలను మీ ప్రేమతో చెడు మార్గంలోకి తీసుకెళ్లడం మంచిది కాదు. సంతాన శైలి అలా ఉంటే వెంటనే మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

పిల్లలను పోషించడం, వారి అవసరాలను తీర్చడం, ప్రేమను అందించడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ దీని అర్థం మీరు మీ పిల్లల ప్రతి కోరికను నెరవేర్చమని కాదు. ఇలా పిల్లల ప...