Hyderabad, అక్టోబర్ 4 -- తెలుగులో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై శశివదనే సినిమాను అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన శశివదే సినిమాను అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగాంగా ఇవాళ శనివారం (అక్టోబర్ 4) నాడు మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు శశివదనే మూవీ టీమ్. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో నిర్మాత అహితేజతోపాటు హీరోయిన్ కోమలి ప్రసాద్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత అహితేజ మాట్లాడుతూ .. "శశి వదనే కోసం మేం ఎంత కష్టపడ్డా కూడా ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మాకు ముందు నుంచీ కూ...