Hyderabad, మే 15 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలను చూసి ఉంటారు. కుప్పలుతెప్పలుగా విభిన్నమైన కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కథా, కథనాలతో మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే జోనర్స్‌లలో హారర్ ఒకటి.

ఇలాంటి హారర్ థ్రిల్లర్ జోనర్‌కు ఫాంటసీ, కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ వంటి వివిధ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను వచ్చాయి. అయితే, ఎప్పుడు ఎక్కడ చూడని హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇలాంటి ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాను మాత్రం ఇప్పటివరకు అస్సలు చూసి ఉండరు.

ఆ హారర్ థ్రిల్లర్ సినిమానే ది విచ్ రివేంజ్. ఓ మంత్రగత్తె పగ అని దీనర్థం. టైటిల్‌కు తగినట్లుగానే సినిమా కథ ఉంటుంది. అయితే, ఆ మంత్రగత్తె సాధారణమైన మనుషుల మీద కాకుండా ఏకంగ...