Hyderabad, మే 2 -- ఆహార ప్రియులకు షాక్ ఇచ్చే అధ్యయనం ఇది. సాయంత్రంమైన బర్గర్లు, పిజ్జాలు, నూనెలో వేయించిన ఆహారాలు తినే వారు ఇకపై చాలా జాగ్రత్గా ఉండాలి. వాటిని తగ్గించుకోవాలి. లేకుంటే ఆయుష్షు తగ్గిపోతుంది. నిండు నూరేళ్లు కాదు కదా. అరవై ఏళ్లు బతకడమే కష్టంగా మారిపోతుంది.

ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల నుండి జాతీయ ప్రాతినిధ్య ఆహార సర్వేలు, మరణాల డేటా నుండి డేటాను విశ్లేషించిన ఒక అధ్యయనం అల్ట్రాప్రాసెసెస్డ్ ఫుడ్స్ (యుపిఎఫ్) వినియోగం వల్ల అకాల మరణాలు సంభవిస్తున్నట్టు కనిపెట్టాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారిలో వచ్చే రోగాల జాబితా పెద్దగా ఉంటుందని, చిన్న వయసులోనే వారు కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం...