భారతదేశం, మే 18 -- గుల్జార్​ హౌస్‌‌లో అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. మంటలు అంటుకున్నప్పుడు లోనికి వెళ్లేందుకు కూడా సరైన మార్గం లేదని చెప్పారు. ఇరుకు మెట్లు, దట్టమైన పొగ మధ్య ఫైర్ సిబ్బందికి లోనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చింది.

గుల్జార్​ హౌస్​ భవనం మొదటి అంతస్తులో నగల వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్​ హాలిడేస్​ సందర్భంగా వ్యాపారి ఇంటికి బంధువులు వచ్చారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఇంట్లో పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు ఘటనా స్థలంలో స్పృహ తప్పి పడిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి.

ఇంట్లోకి పొగ చేరడంతో పాటు.. ఒకే మె...