భారతదేశం, జనవరి 4 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అత్యంత జుగుత్సాకరమైన, అసభ్యకరమైన భాషలో సీఎం రేవంత్ అబద్దాల వరద పారించారని విమర్శించారు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆసాంతం అబద్దాలనే ప్రయోగించారని దుయ్యబట్టారు.

"ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా 'భడివె' వంటి పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన రేవంతు భాషను సభ్య సమాజం క్షమించదు. నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం రేవంతు రాజకీయ నీచత్వానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా యదేచ్చగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ గారు వారించకపోవడం అత్యంత దురదృష్టకరం" అని హరీశ్ రావు పేర్కొన్న...