భారతదేశం, జూన్ 19 -- బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో ఇరాన్ పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోంది. చర్చలు చురుగ్గా జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని పరిస్థితి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది. కొన్ని వర్గాలు ఈ వారాంతం లోనే ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులకు దిగుతుందని పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటారని తెలిపాయి.

ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడి ప్రణాళికను ట్రంప్ ఈ వారం ప్రారంభంలోనే ఆమోదించారని, అయితే, తమ డిమాండ్ల విషయంలో ఇరాన్ స్పందించడానికి వీలుగా తుది అనుమతిని నిలిపివేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్ పై దాడుల గురించి మాట్లాడుతూ.. నేను చేయొచ్చు. లేదా చేయకపోవచ్చు. నేను ఏం చేయబోతున్నానో ఎవరికీ తెలియదు''...