భారతదేశం, జనవరి 15 -- పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని (Airspace) మూసివేసింది. ఈ అనూహ్య నిర్ణయం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ విమానయాన దిగ్గజాలు ఎయిర్ ఇండియా, ఇండిగో తమ ప్రయాణికులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. గగనతల ఆంక్షల వల్ల విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని, కొన్ని సర్వీసులు రద్దు కావొచ్చని స్పష్టం చేశాయి.

ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గగనతలాన్ని మూసివేయడంతో, ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాలను ఎయిర్ ఇండియా ఇతర మార్గాల్లోకి మళ్లిస్తోంది.

"ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నాం. దీనివల్ల ప్రయాణ సమయం పెరిగి, విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది" అని ఎయిర్ ఇండియా ప్రతినిధులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగ...