భారతదేశం, జనవరి 14 -- 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ దేశం మళ్ళీ అంతటి చీకటి రోజులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల సెగలు రాజధాని టెహ్రాన్ వీధులను నెత్తుటి మడుగులుగా మారుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడంతో బయటి ప్రపంచానికి తెలియని దారుణాలు, మంగళవారం నిరసనకారులు విదేశాలకు చేసిన ఫోన్ కాల్స్‌తో వెలుగులోకి వచ్చాయి.

నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 2,571కి చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇరాన్ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి.

నిరసనకారులను అణచివేయడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖ...