భారతదేశం, జనవరి 10 -- ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన మతపరమైన పాలక వ్యవస్థకు ఇప్పుడు అతిపెద్ద సవాలు ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రాలను నిప్పుపెట్టి, ఆ సెగతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న దృశ్యాలు ఇక్కడి పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఈ నిరసనల వెనుక ఒక బలమైన సామాజిక, రాజకీయ సందేశం దాగి ఉంది. ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను తగులబెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. మరోవైపు, ఇరాన్ సమాజంలో మహిళలు ధూమపానం చేయడాన్ని చాలా చోట్ల నిషేధంగా లేదా తప్పుగా భావిస్తారు. ఇప్పుడు మహిళలు ఈ రెండింటిని కలిపి ప్రదర్శించడం ద...