భారతదేశం, జూన్ 17 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధర పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంధనాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకునే భారత్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్​ ఒక్క పని చేస్తే చాలు.. ప్రపంచానికి చమురు సప్లై భారీగా పడిపోవచ్చు. ధరలు అమాంతం పెరిగిపోవచ్చు. ఆ ఒక్కటి.. హార్ముజ్ జలసంధిని(స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​) మూసివేయండి! ఈ స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ ఎందుకు అంత కీలకమైనదో ఇక్కడ తెలుసుకోండి..

స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ ఇరాన్- ఒమన్ మధ్య ఉంది. ఇది ఉత్తరాన ఉన్న గల్ఫ్‌ను దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్‌తో, ఆపైన అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌లతో పాటు చమురు ఎగుమతి చేసే దేశాలు (ఒపెక్​) సభ్యులు ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి దీనిని ఉపయోగిస్...