భారతదేశం, జూన్ 13 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 823 పాయింట్లు పడి 81,692 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 253 పాయింట్లు పతనమై 24,888 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 377 పాయింట్లు పడి 56,082 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,831.42 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,393.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయ...