భారతదేశం, జనవరి 13 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న అణచివేత చర్యలకు నిరసనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్​ తాజా నిర్ణయం భారత్​పై ఎంత ప్రభావం చూపిస్తుంది? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇరాన్‌లో సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు అరెస్టయ్యారు. ఈ హింసను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"వెంటనే అమల్లోకి వచ్చేలా.. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే లావాదేవీలపై 2...