భారతదేశం, డిసెంబర్ 30 -- ఒకప్పుడు మన సినిమాలు వేరు, వాళ్ల సినిమాలు వేరు అనే భావన ఉండేది. కానీ, 2025 నాటికి ఆ గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా పోయింది.

ఉత్తరాది స్టార్లు దక్షిణాది సినిమాల్లో మెరుస్తుంటే.. మన సౌత్ సూపర్ స్టార్లు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. 'పాన్ ఇండియా' అనేది కేవలం ఒక పదంలా కాకుండా, ఇప్పుడు నిజమైన వాస్తవంగా మారిపోయింది. అలా ఇయర్-ఎండర్ 2025లో భాగంగా ఈ ఏడాది ఇతర ఇండస్ట్రీలో నటించి ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో లుక్కేద్దాం.

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సాధారణంగా గెస్ట్ రోల్స్ చేయరు. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించారు.

ఆగస్టు 14, 2025న విడుద...