Telangana,hyderabad, జూన్ 30 -- నిరుపేద‌లకు గృహ వ‌స‌తి క‌ల్పించ‌డంలో భార‌త దేశంలోనే తెలంగాణ రాష్ట్రం త‌ల‌మానికంగా నిలిచేలా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ ప్ర‌భుత్వంకూడా 5లక్ష‌ల రూపాయిల‌తో ఇండ్ల‌ను నిర్మించ‌డం లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసే ఇండ్ల‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తిఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

పేద‌వాడికి మ‌రింత చేయూత ఇవ్వాల‌న్న ఆశ‌యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ ట‌న్నుల ఇసుక‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సోమ‌వారం నాడు మంత్రిగారు అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రిగారు మాట్లాడారు.

పేద‌వారికోసం ఇందిర‌మ్మ ఇండ్ల...