భారతదేశం, ఏప్రిల్ 13 -- అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన.. వలసదారుల గురించి మరో ఉత్తర్వు జారీ చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నియమం ప్రకారం.. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీ పౌరులకు రిజిస్ట్రేషన్ ఇప్పుడు తప్పనిసరైపోయింది. కొత్త నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అరెస్టు కూడా అవ్వొచ్చు. అంతేకాకుండా నమోదు చేసుకోని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించవచ్చు.

అమెరికాలో 30 రోజులకంటే ఎక్కువగా నివసిస్తున్నవారు రిజిస్టర్ చేసుకోవాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధిపతి క్రిస్టీ ఈ మేరకు సందేశం పంపారు. సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గం అని హోమ్ ల్యాండ్...