భారతదేశం, జూలై 30 -- ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని నమ్ముకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ స్టార్ డైరెక్టర్ తో ఫారెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఫిల్మ్ లో మునుపెన్నడూ చూడని విధంగా మహేష్ బాబును చూపించబోతున్నారు రాజమౌళి. మహేష్ లుక్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. మరి ఈ సినిమా తర్వాత మహేష్ చేసే ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న మూవీ మహేష్ బాబుకు 29వ సినిమా. దీంతో 30వ సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మహేష్ తో సినిమా చేసేందుకు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏ డైరెక్టర్ తో అన్నది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది.

మహేష్ బాబు తన 30వ సినిమాను సంచలన డైరెక్ట...