Hyderaad, సెప్టెంబర్ 7 -- ‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విద్రోహి'. విఎస్‌‌వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విద్రోహి ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా తాజాగా విద్రోహి ఫస్ట్ సాంగ్‌ని మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసి, మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు.

చాలా మంచి కథ‎

‎సాంగ్ విడుదల అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "విద్రోహి ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడ...