భారతదేశం, జూన్ 7 -- బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్'. ఈ సినిమా ప్రీమియర్ తాజాగా నిర్వహించారు. దీని కోసం ఆమిర్ ఖాన్ ఇంటికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెళ్లారు. ఆమిర్ ఇంట్లో సచిన్ అడుగుపెట్టగానే అక్కడి వాతావరణమే మారిపోయింది. ఒక్కసారిగా ఆ ఇల్లు స్టేడియంగా మారిపోయింది. సచిన్, సచిన్ పేరుతో మార్మోగిపోయింది.

ఆమిర్ ఖాన్ అప్పటివరకూ సరదాగా గేమ్ ఆడుతూ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ వస్తున్నారని ఎవరో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు కనిపించారు. ఆమిర్ వెళ్లి సచిన్, అంజలి దంపతలకు వెల్ కమ్ చెప్పారు. అక్కడున్న వాళ్లంతా సచిన్ ను చూసి ఫుల్ సర్ ప్రైజ్ అయ్యారు. నమ్మశక్యం కానట్లు చూశారు. ఓ కుర్రాడైతే ఎగిరి గంతేశాడు. ఇక అందరూ సచిన్, సచిన్ అంటూ కేరింతలు కొట్టారు.

రెండు దశాబ్దాలకు పైగా స్టేడియంలో వినిపించిన...