భారతదేశం, మే 15 -- కొన్నిసార్లు, ఇన్స్టాగ్రామ్ లో కొంతమందితో వ్యవహరించడం కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు. అలాంటి వారిని, వారికి తెలియకుండానే, ఆ వ్యక్తిని బ్లాక్ చేయకుండానే, అన్ ఫాలో చేయకుండానే దూరం పెట్టాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. మీరు ఒకరిని పూర్తిగా బ్లాక్ చేయాలనుకోవడం లేదు. అలాగే, అన్ ఫాలో చేయాలని కూడా అనుకోవడం లేదు. కానీ ఆ వ్యక్తితో యాక్టివిటీని పరిమితం చేయాలనుకుంటున్నారు. అలా చేయడం కూడా ఇప్పుడు ఇన్ స్టాలో సాధ్యమే.

ఇన్స్టాగ్రామ్ లో కొందరు వ్యక్తుల అవాంఛిత వ్యాఖ్యలను నివారించడం, మీ ఆన్లైన్ స్థితిని వారికి తెలియకుండా ప్రైవేట్ గా ఉంచడం లేదా కొంతమంది వినియోగదారుల నుండి తక్కువ విజిబిలిటీని కోరుకోవడం లాంటి వాటిని మీరు కోరుకుంటున్నట్లయితే, అది ఇప్పుడు సాధ్యమే. సంబంధాలను పూర్తిగా కత్తిరించాల్సిన అవసరం లేని పరిష్కారాన్ని ఇన్ స్టాగ్రామ్ ఇప్ప...