భారతదేశం, జనవరి 7 -- వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్‌ ఫీల్డ్‌లో యువత కెరీర్‌లను నిర్మించుకోవడానికి, నైపుణ్య ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU), క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి.

రెండింటి మధ్య సహకారం రాష్ట్రంలోని 5,000 మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా వారికి ఉపాధి లభించనుంది. స్కిల్స్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

ఇందులో భాగంగా ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్విక్ కామర్స్‌లో ఉద్యోగ సంబంధిత కార్యాచరణ, నిర్వాహక నైపుణ్యాలను పెంపొందించడానికి మూడు నెలల అభ్యాస కార్యక్రమా...