Hyderabad, సెప్టెంబర్ 1 -- విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా 'అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.

ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అర్జున్ చక్రవర్తి సినిమా పొందింది. అలాగే, ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ అర్జున్ చక్రవర్తి థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, నిర్మాత శ్రీని గుబ్బల ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. చాలా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు. ప్రేక్షకుల రె...