భారతదేశం, జనవరి 30 -- భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు! ఈ ప్రముఖ సోషల్​ మీడియా​ నుంచి విరాట్​ కోహ్లీ అకౌంట్​ మాయమైపోయింది. ఈ వ్యవహారంపై ఇంటర్నెట్​లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

విరాట్​ కోహ్లీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో 270 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు. అతనొక గ్లోబల్ బ్రాండ్, నిత్యం మన కళ్లముందు ఉండే వ్యక్తి, చాలా మంది అభిమానుల రోజువారీ సోషల్ మీడియా అలవాటులో ఒక భాగం. కాబట్టి, కోహ్లీ ప్రొఫైల్​లో "దిస్​ పేజ్​ ఈజ్​ అన్​అవైలబుల్​" (ఈ పేజీ అందుబాటులో లేదు) అనే నిరుత్సాహకరమైన సందేశం కనిపించగానే, ఫ్యాన్స్​లో ఆందోళన మొదలైంది.

విరాట్​ కోహ్లీ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ శుక్రవారం తెల్లవారుజామున కనిపించకుండాపోయింది. రాత్రిపూట మేల్కొనేవా...