భారతదేశం, జనవరి 16 -- సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సోమవారం (జనవరి 12) విడుదలైన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రభాస్ 'రాజా సాబ్'తో పోటీ పడి మరీ చిరు ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం.

చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి ఈసారి ఈ మూవీతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై అనిల్ ఎమోషనల్ అయ్యాడు.

శుక్రవారం (జనవరి 16) సాయంత్రం తన 'ఎక్స్' ఖాతాలో చిరంజీవి పక్...