భారతదేశం, నవంబర్ 22 -- మీరు నిధుల కొరతతో ఉన్నట్లయితే, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఆమోదయోగ్యమైన, ఆచరణాత్మకమైన మార్గం. అయితే మార్కెట్లో చాలా ఆప్షన్స్​ అందుబాటులో ఉండటంతో.. ఏది ఎంచుకోవాలో తెలియక అయోమయం చెందడం సహజంగా మారింది. 'ఇన్‌స్టెంట్​ లోన్' తీసుకోవాలా? లేదా 'క్రెడిట్​ కార్డు లోన్​' తీసుకోవాలా? అనేది అంత తేలికైన నిర్ణయం కాదు. ఈ రెండు అన్‌సెక్యూర్డ్ లోన్‌లను పోల్చి చూస్తూ, ఎవరికి ఏది ఉత్తమమమైన ఎంపిక అవుతుందో ఇక్కడ తెలుసుకుందాము..

సాధారణంగా, లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డులు అనేవి ముందుగానే ఆమోదించి ఉంటాయి. మీరు ఒకసారి క్లిక్ చేస్తే చాలు, డబ్బు మీ ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇది సాధారణంగా మీ క్రెడిట్ కార్డ్ పరిమితిపై ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనిని ఒక ప్రత్యేక రుణంగా పరిగణిస్తారు.

మరోవైపు ఇన్‌స్టంట్ లోన్‌లకు దరఖాస్తు చేయడానికి మంచి క్...