భారతదేశం, జూన్ 4 -- ిగరెట్ తాగే చాలా మంది చెప్పేమాట.. ఇదే లాస్ట్ అని. కానీ మరుసటి రోజు మళ్లీ దాని మీదకు మనసు వెళ్లి ధూమపానం చేస్తుంటారు. భవిష్యత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే.. బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలతో సహా ఏదైనా సమాచారాన్ని దాచిపెడితే.. తర్వాత అది మీకు కష్టంగా అవుతుంది. మీకు ధూమపానం చేసే అలవాటు ఉంటే.. మీరు దానిని పాలసీలో కచ్చితంగా చెప్పాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు.

పొగాకు వాడకం, ముఖ్యంగా ధూమపానం.. భారతదేశంలో అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి. భారతదేశంలో చాలా మంది దీని బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులకు సిగరెట్ వ్యసనం ప్రధాన కారణం. దీంతో ఈ అలవాటు ఉన్నవారికి బీమా కంపెనీలు పాలసీలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉం...