భారతదేశం, డిసెంబర్ 18 -- స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ-కామర్స్ దిగ్గజం మీషో (Meesho) ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ స్టాక్ ఏకంగా 'మల్టీబ్యాగర్‌'గా మారిపోయింది. గురువారం (డిసెంబర్ 18) నాటి ట్రేడింగ్‌లో మీషో షేర్ ధర రూ. 233.50 వద్ద రికార్డు స్థాయిని తాకింది. తన ఐపీఓ ధర రూ. 111 తో పోలిస్తే ఇది 110 శాతం అదనం. అంటే చూస్తుండగానే ఇన్వెస్టర్ల పెట్టుబడి రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది.

వరుసగా నాలుగో రోజు కూడా మీషో షేర్లు లాభాల్లో పయనించాయి. గత నాలుగు రోజుల్లోనే ఈ స్టాక్ సుమారు 41 శాతం పెరగడం గమనార్హం. బిఎస్ఈ (BSE)లో నేడు 8 శాతం లాభంతో రూ. 233.50 వద్ద ట్రేడ్ అయ్యింది. గత మూడు సెషన్లలో వరుసగా 20%, 5.6%, 3.4% చొప్పున పరుగులు పెట్టింది.

ఐపీఓ సమయంలో రూ. 111 గా ఉన్న ధర, లిస్టింగ్ రోజే రూ....