భారతదేశం, జనవరి 2 -- స్టాక్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా కంపెనీ షేర్లు భారీ లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం (జనవరి 02) ట్రేడింగ్‌లో ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర ఏకంగా 9 శాతం పెరిగి రూ. 40.77కి చేరుకుంది. ఇది గడిచిన నాలుగు వారాల్లోనే అత్యధిక ధర కావడం విశేషం. డిసెంబర్ నెలలో కంపెనీ మార్కెట్ వాటా పెరగడం, సర్వీస్ రంగంలో తీసుకున్న కీలక నిర్ణయాలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత పది ట్రేడింగ్ సెషన్లను గమనిస్తే, ఈ స్టాక్ సుమారు 30.5 శాతం రికవరీని సాధించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.

డిసెంబర్ నెలలో కంపెనీ తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంది. వాహన్ (VAHAN) డేటా ప్రకారం..

తమ ఎదుగుదలకు అడ్డంకిగా మారిన సర్వీస్ సమస్యలను అధిగమించేందుకు ఓలా 'హైపర్ సర్వీస్' (Hyperservice)...