భారతదేశం, జూలై 2 -- బెంగళూరులోని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లోని విశ్రాంతి గదిలో మహిళా సహోద్యోగుల అశ్లీల వీడియోలను చిత్రీకరించిన 28 ఏళ్ల ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఒక మహిళా ఉద్యోగి బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో అక్కడ ఒక అసాధారణమైన విషయాన్ని గమనించింది. ఎదురుగా ఉన్న గోడలో నుంచి ఎవరో రహస్యంగా రికార్డ్ చేస్తున్న విషయాన్ని ఆ మహిళ గుర్తించింది. జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆమెకు గోడకు అవతలవైపు దాక్కుని రహస్యంగా తన ఫోన్ తో వీడియో రికార్డు చేస్తున్న పురుష సహోద్యోగిని చూసి షాక్ కు గురైంది. వెంటనే ఆమె అందరినీ అప్రమత్తం చేసింది. అక్కడకు చేరుకున్న ఇతర ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని బంధించారు.

నిందితుడిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వప్నిల్ నగేష్ మాలిగా గుర్తించారు. అ...