భారతదేశం, జనవరి 28 -- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. గిరిజన వర్గానికి చెందిన ఓ వ్యక్తి చేసిన తీవ్ర ఆరోపణలతో పోలీసులు వీరిపై కేసు వేశారు.

71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సీసీహెచ్) ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్​లో ఈ కేసు నమోదైంది.

హనీ ట్రాప్ కేసులో తనన తప్పుగా ఇరికించారని, ఆ తర్వాత క్రిస్ గోపాలకృష్ణన్ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో ఉద్యోగం నుంచి కూడా తొలగించారని దుర్గప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదుదారుడు దుర్గాప్ప గిరిజన బోవి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

2014 వరకు ఐఐఎస్సీలోని సెంటర...