Hyderabad, ఆగస్టు 24 -- స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద వస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాను విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

ఈ మూవీలో బాహుబలి కట్టప్ప సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ 29న ఆడియెన్స్ ముందుకు థియేటర్లలో రానుంది.

ఈ క్రమంలో రిలీజ్ చేసిన త్రిబాణధారి బార్బరిక్ టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక త్వరలో థియేట్రికల్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స సినిమాతోపాటు వ్యక్తిగత విశేషాల్ని పంచుకున్నారు.

నేను సంగీతాన్ని నేర్చుకున్నా కూడా.. నాకు సి...