భారతదేశం, మే 3 -- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఏం చేశారనే దానిపై సమీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటున్నారు.. ప్రజలను కలుస్తున్నారా.. ఎన్నికల సమయంలో లోకల్‌గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా.. అనే అంశాలపై సీఎం రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.సీఎం రేవంత్‌ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏమేం పనులు చేశారు, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆరా తీస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం చేస...