Hyderabad, జూలై 24 -- అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణ లో యోగేష్ కల్లే నిర్మించిన లేటెస్ట్ మూవీ త్రిముఖ. ఈ సినిమాలో అడల్ట్ స్టార్ సన్నీ లియోన్, యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, ఆశు రెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్ ముఖ్య తారాగణంగా చేస్తున్నారు.

త్రిముఖ సినిమాకు రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణంలో భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా త్రిముఖ సినిమా నుంచి "గిప్పా గిప్పా" అనే ఐటమ్ సాంగ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

దీనికి సంబంధించిన విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. యోగేష్ కల్లే, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ పాట సినిమా ప్రపంచంలో ట్రేండింగ్ అవుతుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెబుతున్నా...