Hyderabad, సెప్టెంబర్ 17 -- సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు స్టార్లు మళ్ళీ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం కోసం వాళ్ళ ఫ్యాన్స్ చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ఇద్దరు స్టార్లు 'అపూర్వ రాగంగళ్', 'మూండ్రు ముడిచు', 'అవర్గళ్', 'పతినారు వాయతినెలె' లాంటి చాలా సినిమాల్లో కలిసి నటించారు.

రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే కమల్ హాసన్ చెప్పాడు. ఇప్పుడు దానిని మరోసారి రజనీ కూడా కన్ఫమ్ చేశాడు. కథ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. బుధవారం (సెప్టెంబర్ 17) చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ ఆ ప్రాజెక్ట్ వివరాలు చెప్పాడు.

"రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ఒక సినిమా చేయబోతున్నాం. డైరెక్టర్‌ని ఇంకా ఫైనల...