భారతదేశం, మే 13 -- బావ ఇద్దరు బావమరుదులను హతమార్చిన దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి వరకూ అందరూ కలిసి మద్యం తాగిన తర్వాత.. గొడవ జరిగింది. ఈ గొడవలో బావ బరిసేతో తన బావమరుదులను చంపేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 11 అంశాలు ఇలా ఉన్నాయి.

1.గూడెంకొత్తవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపునకు చెందిన కిముడు కృష్ణ (52) ఒడిశాలోని కటక్‌లో, కిముడు రాజు(38) విశాఖపట్నంలో జీవనం సాగిస్తున్నారు.

2.ఈ ఇద్దరికి పెద్దమ్మ వరసైన మామిడి సీతమ్మ.. శనివారం చింతపల్లి క్యాంపులో చనిపోయింది. ఈమె అంత్యక్రియల నిమిత్తం వీరు ఆదివారం స్వగ్రామం వచ్చారు.

3.సీతమ్మ అంత్యక్రియలు జరిగిన తర్వాత రాజు, కృష్ణ తిరిగి వారివారి ఇళ్లకు బయలుదేరారు. ఈ సమయంలో నిందితుడు గెన్నూ వారిని సీలేరు తీసుకొచ...