Hyderabad, జూన్ 20 -- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలాంటి క్రేజీ కాంబినేషన్ తో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజైంది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ మూవీని ఓ మాస్టర్ పీస్ అని అనడం విశేషం.

కుబేర మూవీపై నాగ్ అశ్విన్ శుక్రవారం (జూన్ 20) ఉదయమే రివ్యూ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఈ సినిమాను ఓ మాస్టర్ పీస్‌గా అభివర్ణించాడు. ఏమాత్రం ఆలోచించకుండా మూవీకి వెళ్లాలని ప్రేక్షకులకు సూచించాడు.

"మాస్టర్ ఫ. పీస్. ఆలోచించకండి. వెళ్లండంతే" అనే క్యాప్షన్ తో థియేటర్లలో మూవీని ప్రదర్శిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అతని పోస్ట్ వెంటనే వైరల్ గా మారిపోయింది. గతేడాది క...