Hyderabad, అక్టోబర్ 3 -- ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నటుడు రిషబ్ శెట్టి తాజా చిత్రం 'కాంతార చాప్టర్ 1' ను ప్రశంసలతో ముంచెత్తాడు. శుక్రవారం (అక్టోబర్ 3) ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్ అని అభివర్ణించాడు. "భారతీయ సినిమా ఇంతకుముందు ఇలాంటిదాన్ని ఎప్పుడూ చూడలేదు" అని కూడా అన్నాడు. రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించడమే కాకుండా, కథను రాసి, దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే.

రిషబ్ శెట్టి 'కాంతార ఛాప్టర్ 1'ను ప్రశంసిస్తూ సందీప్ రెడ్డి వంగా శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుఝామున ఓ ట్వీట్ చేశాడు. "కాంతార ఛాప్టర్ 1 నిజమైన కళాఖండం. భారతీయ సినిమా ఇంతకుముందు ఇలాంటిదాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ తుఫాను. రా, డివైన్, అన్‌షేకబుల్. రిషబ్ శెట్టి నిజమైన వన్‌ మ్యాన్ షోను అందించాడు. ఒక్కడే దీనిని రూపొందించి, మోశాడు రిషబ్ శెట్టి. ...