Hyderabad, మే 29 -- అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై గురువారం (మే 29) అతడు తన ఇన్‌స్టా ద్వారా స్పందించాడు. పుష్ప 2 మూవీకిగాను అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. మరి దీనిపై అతడు ఏమన్నాడో ఒకసారి చూడండి.

తనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు. తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో పుష్ప 2 కోసం నాకు తొలి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ ఘనత అంతా డైరెక్టర్ సుకుమార్ గారికి, ప్రొడ్యూసర్లకు, మొత్తం పుష్ప టీమ్ కు దక్కుతుంది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితమిస్తున్నాను. మ...