భారతదేశం, డిసెంబర్ 17 -- జేమ్స్ కామెరాన్ ప్రతిష్టాత్మక మూవీ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar 3) ఫస్ట్ రివ్యూస్ చాలా నిరాశజనకంగా ఉన్నాయి. ఈ సినిమాకు 'రోటెన్ టొమాటోస్'లో ఈ ఫ్రాంచైజీలోనే అత్యల్ప రేటింగ్ (70%) వచ్చింది. బీబీసీ, గార్డియన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు దీనిని "అర్థం లేని సినిమా", "వీడియో గేమ్ గ్రాఫిక్స్" అంటూ ఘాటు విమర్శలు చేశాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని కొందరు ప్రశంసించారు.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఈ శుక్రవారం (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. మొదటి రెండు భాగాలతో ('అవతార్', 'అవతార్: ది వే ఆఫ్ వాటర్') పోలిస్తే.. మూడో భాగానికి నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వస్తున్నాయి.

ప్ర...