Hyderabad, సెప్టెంబర్ 10 -- శివకార్తికేయన్ తన లేటెస్ట్ సినిమా 'మదరాసి' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మాసీ యాక్షన్ థ్రిల్లర్‌లో శివకార్తికేయన్ ఒక యాక్షన్ హీరోగా కనిపించాడు. ఇప్పటివరకు, ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడుతోంది. అయితే బుధవారం (సెప్టెంబర్ 11) నటుడు రజనీకాంత్ సినిమా చూసి చాలా ఇష్టపడ్డారని శివకార్తికేయన్ చెప్పాడు. ఈ మూవీ చూసి అతడు ఏమన్నాడో ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

శివకార్తికేయన్ తన ఎక్స్ అకౌంట్‌లో రజనీకాంత్ రివ్యూను షేర్ చేశాడు. "నా ఐడల్, నా తలైవర్, సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ నుంచి మదరాసికి అప్రిసియేషన్ వచ్చింది. 'మై గాడ్, ఎక్సలెంట్! ఏమి పెర్ఫార్మెన్స్.. ఏమీ యాక్షన్.. సూపర్ సూపర్ ఎస్‌కే.. నాకు చాలా నచ్చింది. నువ్వు యాక్షన్ హీరో అయిపోయా...