Hyderabad, జూన్ 27 -- సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ అందుకున్నాడు. అలాగే, బిచ్చగాడు 2 సినిమాతో కూడా బాగా అలరించాడు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతూన్న విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్.

విజయ్ ఆంటోని నటించి నిర్మించిన 'మార్గన్' చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించారు. సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సమర్పించారు. మార్గన్ సినిమాను జూన్ 27న తెలుగు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయిన మార్గన్ టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి...