భారతదేశం, జూలై 12 -- రొమాంటిక్ హీర ఆర్.మాధవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. రొమాంటిక్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఆర్. మాధవన్, ఫాతిమా సన షేక్ నటించిన తాజా హిందీ చిత్రం 'ఆప్ జైసా కోయి' శుక్రవారం (జూలై 11) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మెచ్యూర్డ్ లవ్, ఫ్రెండ్ షిప్ చుట్టూ ఈ మూవీ తిరుగుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటలోకి వచ్చిన ఆప్ జైసా కోయి మూవీలో రొమాంటిక్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు మాధవన్. అయితే రొమాంటిక్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఆప్ జైసా కోయి మూవీనే తనకు లాస్ట్ రొమాంటిక్ మూవీ కావొచ్చని పేర్కొన్నాడు. జస్ట్ టు ఫిల్మీతో ఇంటర్వ్యూలో మాధవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

''వయసుకు తగిన రొమాన్స్ ను చూపించాలనే కోరిక వల్లే ఆప్ జైసా కోయి సినిమాలో ఈ పాత్రను చేశా. ఇటువంటి ప్రేమ కథలు మెయిన్ స్ట్రీమ్ లో తక్కువగ...