Hyderabad, మే 14 -- తిరుమలలో కొలువైన శ్రీవారికి సంబంధించిన గోవింద నామాలను భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పలుకుతారు. అలాంటి వాటిని ఓ అసభ్యకరమైన పాటలో చేర్చడంపై ఇప్పుడు టీటీడీతోపాటు శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. తమిళ నటుడు సంతానం మూవీ డీడీ నెక్ట్స్ లెవెల్ సాంగ్ కిస్సా 47లో శ్రీనివాస గోవిందా అనే పదాలను దారుణంగా చూపించడంతో చిక్కుల్లో పడ్డాడు.

డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీలోని కిస్సా 47 సాంగ్ రెండు నెలల కిందటే రిలీజైంది. ఈ మూవీ మే 16న రిలీజ్ కాబోతోంది. ఈ సమయంలో ఈ పాటపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. గోవింద నామాలను ఇలా ఓ అసభ్యకరమైన పాటలో వాడటంపై బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితోపాటు జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అలా చేయలేకపోతే రూ.100 కోట్లను ...