Hyderabad, ఆగస్టు 20 -- దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణల హిస్టారిక్ వార్ డ్రామా 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ జులై 24న థియేటర్లలో విడుదలైంది. వీఎఫ్‌ఎక్స్, స్క్రీన్‌ప్లేపై విమర్శలు రావడంతో ఈ సినిమా ఆశించినంతగా సక్సెస్ సాధించలేదు. ఆగస్టు 20న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

థియేటర్లలో విడుదలైనప్పటి నుండి హరి హర వీరమల్లు మూడు వేర్వేరు క్లైమ్యాక్స్ లతో అభిమానులను అయోమయానికి గురి చేసింది. మొదటి వెర్షన్ 2 గంటల 43 నిమిషాల నిడివితో వీర మల్లు (పవన్), ఔరంగజేబు (బాబీ డియోల్) మధ్య ఒక టోర్నడోతో కూడిన హాస్యాస్పదమైన ఫైట్ సీన్ తో ముగిసింది.

దీనిపై విమర్శలు రావడంతో.. నిర్మాత ఏఎం రత్నం నిడివి...