భారతదేశం, జూలై 23 -- డెబ్యూ హీరో హీరోయిన్.. స్టార్లు లేని సినిమా.. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్.. అయినా బాక్సాఫీస్ దగ్గర 'సయ్యారా' (Saiyaara) దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు కంటే అయిదో రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించడం విశేషం. ఇప్పుడు సయ్యారా మూవీ ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతోంది.

మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా చిత్రం జూలై 18 న విడుదలైనప్పటి నుండి భారీ బజ్ క్రియేట్ చేయడంతో క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. కొత్త నటులు అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన సయ్యారా తొలి రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా జోరు తగ్గే సూచనలు కనిపించడం లేదని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.

సక్నిల్క్ తాజా అప్ డేట్ ప్రకారం సయ్యారా అయిదో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. మొదటి మంగళవారం (జూలై 22) సి...