Hyderabad, జూలై 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురుచూసిన సినిమా'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పకులుగా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

భారీ అంచనాల నడుమ జూలై 24న థియేటర్లలో విడుదలైన హరి హర వీరమల్లు సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రశంసలు వస్తున్నాయి. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం పనితీరుపై కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హరి హర వీరమల్లు విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ ఈవెంట్‌లో నిర్మాత ఏఎం రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ...