భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలుసు కదా. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ఈ సినిమాకు తాజాగా అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టరే కాదు.. సంక్రాంతి బాస్‌బస్టర్ కూడా అంటూ తనదైన స్టైల్లో చెప్పాడు.

సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై తాజాగా అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ కూడా వైరల్ అవుతోంది.

"మొత్తం టీమ్‌కు కంగ్రాట్స్. బాస్ ఈజ్ బ్యాక్.. లిట్ (L-I-T). మా మెగాస్టార్ చిరంజీవి గారు స్క్రీన్‌ను వెలిగించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వింటేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి" అని ఆ పోస్ట్‌లో అల్లు అర...