Hyderabad, ఆగస్టు 13 -- యానిమల్ వంటి సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. స్పిరిట్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి తాజాగా జిగ్రీస్ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిగ్రీస్ టీజర్ లాంచ్‌లో సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

"ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు ఎల్కేజీ నుంచి స్నేహితుడు. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యొద్దు అంటా అని నాకు చెప్పకుండా స్టార్ట్ చేసిండు. యానిమల్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది గోవాలో అని చెప్పాడు. ఇక నేను తిట్టుడు స్టార్ట్ చేసిన ఫోన్లోనే.. ఈ ప్రొడక్షన్ అవి ఎందుకని" అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.

"నేను యానిమల్ షూట్ గ్యాప్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు...