భారతదేశం, మే 15 -- ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ లో జోరు కొనసాగుతోంది. పాత సినిమాలకు కొత్త హంగులు అద్ది థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అలాగే రీ రిలీజైంది. ఏ మూవీ అయినా మహా అయితే అయిదారు సార్లు రీ రిలీజ్ అవడమే గొప్ప. అలాంటిది ఓ మూవీ ఏకంగా 555 సార్లు రీ రిలీజైంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లకు రాబోతున్న ఆ ఫిల్మ్ పేరు 'ఓం'.

1995 మే 19న ఓం సినిమా రిలీజైంది. ఈ కన్నడ మూవీకి వర్సటైల్ యాక్టర్ గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఉపేంద్ర డైరెక్టర్. శివరాజ్ కుమార్, ప్రేమ హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అప్పట్లో ఈ మూవీ సంచలనం నమోదు చేసింది. కన్నడ సినీ చరిత్రలోనే కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ మూవీ ఇప్పటికే 555 సార్లు రీ రిలీజైంది. ఇప్పుడు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి మే 19న రీ రి...